ఆక‌ట్టుకుంటున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ఫ‌స్ట్ లుక్స్‌

Fri,March 8, 2019 09:35 AM
Sanjay Dutt, Aditya Roy Kapur first looks released

బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ క‌ల‌ల ప్రాజెక్ట్ క‌ళంక్ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి . ఈ చిత్రంలో న‌టిస్తున్న స్టార్ హీరోల పాత్ర‌ల‌ని ఒకొక్క‌టిగా ప‌రిచ‌యం చేస్తూ మూవీపై అంచ‌నాలు పెంచుతున్నాడు క‌ర‌ణ్‌. ముందుగా ప్రీ లుక్ విడుద‌ల చేసిన చిత్ర బృందం హీరో వరుణ్ ధావన్‌ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వరుణ్‌ భయంలేని ప్రేమికుడు జాఫర్‌ పాత్రలో కనిపించనున్నాడని పోస్ట‌ర్ ద్వారా తెలిపింది. ఇక తాజాగా సంజ‌య్ ద‌త్ , ఆదిత్య రాయ్ క‌పూర్ ఫ‌స్ట్ లుక్స్ కూడా విడుద‌ల చేశారు. బాల్ రాజ్ చౌద‌రి పాత్ర‌లో సంజ‌య్ లుక్ అదిరిపోగా, దేవ్ చౌద‌రి పాత్ర‌లో ఆదిత్య రాయ్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంద‌ని అంటున్నారు. ఇక‌ రూప్ అనే పాత్ర‌లో అలియా న‌టిస్తుండ‌గా, ఆమె పాత్ర‌కి సంబంధించిన లుక్ కూడా విడుద‌లైంది. భారీ పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ వ‌ర్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కరణ్ జోహర్‌, సాజిద్ నదియావాలా, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 19న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబ‌ధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశాడు క‌ర‌ణ్. ఈ చిత్రం కరణ్‌ జోహార్‌ తండ్రి యశ్‌ జోహార్‌ కలల ప్రాజెక్టు కావ‌డంతో ప్రత్యేక శ్రద్ధ తీసు‌కుం‌టు‌న్నాడు.‌ తను ఇంత‌వ‌రకు నిర్మిం‌చిన చిత్రా‌ల‌లో‌కెల్లా అత్యంత ప్రతి‌ష్టా‌త్మ‌క చిత్రంగా ‌‘కళంక్‌’ ని తీర్చి‌ది‌ద్దా‌లని కృత‌ని‌శ్చ‌యంతో ఉన్నాడు. ఈ సినిమా కోసం ఓల్డ్‌ ఢిల్లీ సిటీ సెట్టింగ్‌ నిర్మా‌ణా‌నికి ఏకంగా పది‌హేను కోట్లు ఖర్చు చేసాడ‌ట‌.‌ ఫిలిం‌సి‌టీలో నిర్మా‌ణంలో ఉన్న ఈ సెట్టింగ్‌ లోపలి విశే‌షా‌లను పత్రి‌క‌లకు లీక్‌ కానీ‌య‌కుండా తగిన సెక్యూ‌రిటీ ఏర్పాటు చేశారు.‌ అమృత మహల్‌ నికాయ్‌ ఈ సెట్టింగ్‌ డిజైన్‌ చేశారు.‌ ఇందులో పాత ఢిల్లీ మొహల్లా నిర్మాణం ముఖ్య‌మైంది.‌ 1940 ప్రాంతంలో దేశ విభ‌జన విషయ ప్రధా‌నంగా జరి‌గిన సంప్రదిం‌పు‌లకు ఈ మొహల్లా కేంద్రంగా ఉండ‌టంతో ఈ సెట్టింగు అధిక ప్రాధాన్యం సంత‌రిం‌చు‌కుంది. ఈ సిని‌మాలో సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్, ఆలియా భట్, వరుణ్‌ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్‌ ముఖ్య పాత్రలు పోషి‌స్తు‌న్నారు. మాధురీ దీక్షిత్ పాత్ర‌కి ముందుగా శ్రీదేవిని అనుకోగా, ఆమె హఠాన్మ‌ర‌ణంతో నిర్మాత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.


3100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles