ఆ హీరో న‌న్ను ఇబ్బంది పెట్టాడ‌నేది అవాస్త‌వం

Wed,October 24, 2018 11:31 AM
Sanjana Sanghi ends silence on sexual harassment claims

ఇండియాలో మొద‌లైన మీటూ ఉద్య‌మం ఉదృతంగా సాగుతున్న ద‌శ‌లో కొంద‌రు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సెట్స్‌లో హీరోయిన్‌ని వేధించాడంటూ పుకార్లు సృష్టించారు. ‘కిజీ ఔర్‌ మ్యానీ’లో క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంజ‌న సంఘి అనే యువ‌తి ప‌ట్ల సుశాంత్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని, సెట్స్‌లో ఆమెని ఇబ్బంది పెట్టాడ‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై సుశాంత్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా హీరోయిన్‌తో చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. ఒకరి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తప్పని తెలుసు. కానీ, ఇలా చేయక తప్పడంలేదు. అని సుశాంత్‌ ట్విటర్‌లో వెల్లడించారు. అయితే త‌న‌పై వ‌చ్చిన వార్త‌ల‌ని తెలుసుకున్న సంజ‌న తాజాగా త‌న ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. యూఎస్ లాంగ్ ట్రిప్ వెళ్లిన నేను ముంబై చేరుకున్న నిరాధార‌మైన వార్త‌లు ప్ర‌సారం కావ‌డం చూసి షాక్ అయ్యాను. సుశాంత్ నాతో సెట్స్‌లో అస‌భ్య‌కరంగా ప్ర‌వ‌ర్తించాడ‌నేది అవాస్త‌వం. ఇక ఇప్ప‌టితో వ‌దంతుల‌కి చెక్ పెడ‌దాం అని ట్వీట్‌లో తెలిపారు సంజ‌న‌. ‘ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ సిరీస్‌కు రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ‘కిజీ ఔర్‌ మ్యానీ’ ముఖేశ్‌ చాబ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ముఖేశ్‌పై కూడా లైంగిక ఆరోపణలు ఉండడంతో ఆయన్ని సినిమా నుంచి తప్పించనున్నట్లు సమాచారం.2171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles