డ్ర‌గ్స్‌కి బానిసైన కొడుకు కోసం న‌న్ను వాడుకున్నావు: సంగీత‌

Sun,April 14, 2019 07:47 AM
Sangeetha Krish writes emotional letter

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో న‌టించిన సంగీత చాన్నాళ్ళ త‌ర్వాత హాట్ టాపిక్‌గా మారింది. త‌న‌ని ఇంటి నుండి వెళ్ల‌మ‌ని సంగీత ఫోర్స్ చేస్తుంద‌ని సంగీత త‌ల్లి భానుమ‌తి మ‌హిళా క‌మీష‌న్‌కి ఫిర్యాదు చేయ‌డంతో ఆమెపై ప్ర‌తి ఒక్క‌రు మండిప‌డుతున్నారు. దీంతో ఆమె త‌న త‌ల్లిని ఉద్దేశిస్తూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది.

ప్రియ‌మైన అమ్మా, ఈ ప్రంప‌చంలోకి న‌న్ను తీసుకొచ్చినందుకు నీకు ధ‌న్య‌వాదాలు. 13 ఏళ్ళ వ‌య‌స్సులో నన్ను స్కూలుకి దూరం చేసి, ప‌ని చేయించినందుకు ధన్యవాదాలు. ఖాళీ చెక్కుల‌పై నాతో సంత‌కాలు చేయించినందుకు కృత‌జ్ఞ‌త‌లు. మందు, డ్ర‌గ్స్‌కి బానిసై జీవితంలో ఏ రోజూ ప‌నికి వెళ్ళ‌ని నీ కుమారుల కోసం నన్ను దోపిడి చేసినందుకు ధ‌న్య‌వాద‌ములు. నేను పోరాడే వ‌ర‌కు నాకు పెళ్లి చేయ‌నందుకు ధ‌న్య‌వాదాలు. న‌న్ను, నా భ‌ర్త‌ని వేధిస్తూ మా ప్ర‌శాంత‌త‌ని దూరం చేసినందుకు థ్యాంక్స్. ఓ త‌ల్లి ఇలా ఉండ‌కూడ‌ద‌ని తెలియ‌జేసినందుకు ధ‌న్య‌వాదాలు. చివ‌రిగా నువ్వు చేసిన త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌కి థ్యాంక్స్.

నువ్వు తెలిసో తెలియ‌క‌నో నోరు లేని అమ్మాయిని పోరాడే మ‌హిళగా మార్చావు. ఈ విష‌యంలో నిన్ను ప్రేమిస్తుంటాను. ఏదో ఒక రోజు నీ ఈగోని ప‌క్క‌న పెట్టి న‌న్ను చూసి క‌చ్చితంగా గ‌ర్విస్తావు అంటూ సంగీత త‌న పోస్ట్‌లో రాసింది. ప్ర‌స్తుతం త‌మిళ చిత్రాల‌లో న‌టిస్తున్న సంగీత ప‌దేళ్ళ క్రితం క్రిష్ అనే వ్య‌క్తితో ఏడ‌డుగులు వేసింది. వారికి 2012లో ఆడ‌బిడ్డ జ‌న్మించిన విష‌యం విదిత‌మే. సంగీత త‌ల్లి భానుమ‌తికి సంగీత‌తో పాటు ఇద్ద‌రు కొడుకులు ఉండ‌గా, ఇటీవ‌ల త‌న చిన్న కొడుకు మ‌ర‌ణించాడు.

19331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles