విజ‌య్, రాశీ ఖ‌న్నా 'సంగ తమీజన్' ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,September 21, 2019 10:44 AM

ఇటు తెలుగు, అటు త‌మిళంలో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నవిలక్షణ హీరో విజయ్ సేతుపతి. ఆయ‌న‌ హీరోగా తెరకెక్కుతున్న సంగ తమీజన్ చిత్రంలో రాశీ ఖ‌న్నా, నివేదా పేతురాజ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదటిసారి విజయ్ సేతుపతి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్-మీనన్ ద్వయం సంగీతం అందిస్తుండగా అక్టోబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో యాక్ష‌న్‌, రొమాన్స్ , కామెడీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి. విజ‌య్ సేతుప‌తి తెలుగులో సైరా చిత్రంతో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌తో విజ‌య్‌కి తెలుగులోను మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డం ఖాయం. మ‌రి తాజాగా విడుద‌లైన సంగ త‌మీజ‌న్ చిత్ర ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.


1151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles