అంచ‌నాలు పెంచిన సంఘ‌మిత్ర ఫ‌స్ట్ లుక్

Thu,May 18, 2017 06:35 PM
SANGAMITHRA SHRUTI HAASAN look released

సౌత్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కి సంచలనాలు క్రియేట్ చేస్తున్న చిత్రం బాహుబలి2. ఇప్పుడు ఈ చిత్రానికి ధీటుగా 2.0 చిత్రాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇక కొద్ది రోజులుగా సౌత్ ఇండస్ట్రీలో ఓ భారీ బడ్జెట్ చిత్రం సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుంది. జయం రవి, ఆర్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంఘమిత్ర అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో శృతి యువరాణిగా నటించనుండగా, ఆ పాత్ర కోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టింది. అయితే తాజాగా శృతికి సంబంధించిన పోస్ట‌ర్ ని కేన్స్ లో విడుద‌ల చేసిన‌ట్టు స‌మాచారం. వీర‌నారి లుక్ లో క‌నిపిస్తున్న శృతి ఫోటో తో పాటు జ‌యం ర‌వి ఫోటో కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ పోస్ట‌ర్ ని చూసిన ఫ్యాన్స్ సంఘ‌మిత్ర చిత్రం బాహుబ‌లి కి త‌ప్ప‌క పోటీగా నిలుస్తుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ అంతా కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో సంద‌డి చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.2520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles