మరో భారీ బడ్జెట్ చిత్రానికి టైం ఫిక్స్..!

Tue,May 9, 2017 03:42 PM
Sangamithra movie launched at Cannes Film Festival

సౌత్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కి సంచలనాలు క్రియేట్ చేస్తున్న చిత్రం బాహుబలి. ఇప్పుడు ఈ చిత్రానికి ధీటుగా 2.0 చిత్రాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇక కొద్ది రోజులుగా సౌత్ ఇండస్ట్రీలో ఓ భారీ బడ్జెట్ చిత్రం సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుంది. జయం రవి, ఆర్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంఘమిత్ర అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో శృతి యువరాణిగా నటించనుండగా, ఆ పాత్ర కోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టింది.

సంఘమిత్ర చిత్రం కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తున్నపటికి, ఈ మూవీ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది అని ప్రతి ఒక్క అభిమాని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సంఘమిత్ర చిత్రాన్ని కేన్స్ లో లాంచ్ చేయనున్నట్టు సమాచారం. మే 17 నుండి 28వరకు జరగనున్న ఈ కేన్స్ ఉత్సవాలలోని తొలి రోజు సంఘమిత్ర మూవీ లాంచింగ్ కార్యక్రమం ఉండనుందట. దర్శక నిర్మాతలతో పాటు శృతి ఈ కార్యక్రమానికి హాజరు కానుండగా, తొలి సారి దక్షిణ సినీ పరిశ్రమ నుంచి హాజరైన తొలి సెలబ్రిటీగా శృతి కానుంది. ఈ ఏడాదిలో సంఘమిత్ర చిత్రీకరణ జరపాలని ప్లాన్ చేస్తుండగా, వచ్చే ఏడాది థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

1991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles