మ‌రోసారి బాలీవుడ్ హీరోతో సినిమా చేయ‌నున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్

Wed,September 11, 2019 01:25 PM

విజ‌య్ దేవ‌ర‌కొండ, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం భారీ విజ‌యం సాధించ‌డంతో హిందీలో రీమేక్ చేశాడు సందీప్. షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం అక్క‌డ కూడా మంచి విజ‌యం సాధించింది. క‌ట్ చేస్తే సందీప్ రెడ్డి వంగా త‌ర్వాతి ప్రాజెక్ట్‌కి సంబంధించి కొన్నాళ్ళుగా ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌హేష్ బాబుతో సినిమా అని కొంద‌రు చెప్పుకొస్తుండ‌గా, మ‌రి కొంద‌రు స‌ల్మాన్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం సందీప్ రెడ్డి త‌దుప‌రి ప్రాజెక్ట్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ఉంటుందని బీటౌన్ టాక్. ఇటీవ‌ల సందీప్ .. టీ సిరీస్ అధిప‌తి భూష‌ణ్ కుమార్‌ని క‌లిసి స్టోరీ న‌రేట్ చేశార‌ట‌. ఆయ‌నకి క‌థ న‌చ్చ‌డంతో సినిమా నిర్మించేందుకు ముందుకు వ‌చ్చాడ‌ని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా విష‌యంలో ర‌ణ్‌బీర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు కూడా స‌మాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా, షంషెరా చిత్రాల‌తో పాటు ల‌వ్‌రంజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.

2548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles