మ‌రో హీరోకి గాయం.. ఆందోళ‌న‌లో అభిమానులు

Sun,June 16, 2019 07:04 AM
sandeep met with an accident

టాలీవుడ్‌లో హీరోల‌కి వ‌రుస‌గా జ‌రుగుతున్న ప్ర‌మాదాలు అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తున్నాయి. రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌డం వ‌ల‌న కొన్నాళ్ళు షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. గోపిచంద్ కూడా చాణ‌క్య షూటింగ్‌లో గాయ‌ప‌డ్డాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా కొద్ది రోజులు వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత నాని, వ‌రుణ్ తేజ్‌, నాగ శౌర్య ఇలా ప‌లువురు హీరోలు ప‌లు ప్ర‌మాదాల‌లో గాయ‌ప‌డ్డారు. తాజాగా యువ హీరో సందీప్ కిష‌న్ షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

సందీప్ కిష‌న్ ప్ర‌స్తుతం జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెనాలి రామకృష్ణ అనే సినిమా చేస్తున్నాడు. కర్నూలులో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల హీరోకి గాయాలు అయ్యాయి. ఫైట్‌లో భాగంగా బాంబ్ బ్లాస్ట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాంబ్ మిస్ ఫైర్ కావడం వల్ల సందీప్ కిషన్ ఛాతీ, కుడి చేతిపై గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే కర్నూలు మై క్యూర్‌ హాస్పిటల్‌కి తరలించారు. వైద్యులు ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం సందీప్‌ని హైదరాబాద్ అపోలో హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించిన‌ట్టు స‌మాచారం. సందీప్ న‌టించిన 'నిను వీడని నీడను నేనే' జూలై 12న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. సందీప్ రీసెంట్‌గా త‌న ట్విట్ట‌ర్‌లో రిస్కీ స్టంట్‌కి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు నివ్వెర‌పోతున్నారు.


2446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles