త‌న కొడుకు పేరుని అర్జున్ రెడ్డిగా ఫిక్స్ చేసిన స్టార్ డైరెక్ట‌ర్

Wed,June 5, 2019 02:30 PM

అర్జున్ రెడ్డి చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. ప్ర‌స్తుతం అర్జున్ రెడ్డి చిత్రాన్ని క‌బీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఇందులో షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. అయితే క‌బీర్ సింగ్ చిత్ర రిలీజ్ నేప‌థ్యంలో మీడియాతో ముచ్చ‌టించిన సందీప్ రెడ్డి.. అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఓ య‌జ్ఞంలా భావించి చేసిన‌ట్టు తెలిపాడు. త‌న ప్ర‌య‌త్నంలో నిర్మాత‌లు, కుటుంబ స‌భ్యుల స‌హాకారం మ‌రువ‌లేనిద‌ని పేర్కొన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాకు నా తండ్రి ప్రభాకర్, ప్రణయ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. నాకే కాదు.. నా కుటుంబానికి కూడా అర్జున్ రెడ్డి అలా దగ్గరయ్యాడు అని సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. అయితే ఈ చిత్రం ఇంత భారీ విజ‌య్ సాధించిన నేప‌థ్యంలో త‌న కొడుకు పేరు అర్జున్ రెడ్డి అని పెట్టుకున్నాడ‌ట సందీప్. కబీర్ సింగ్ చిత్రం కూడా త‌న‌కి మంచి విజ‌యం అందిస్తుంద‌ని భావిస్తున్నాడు అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్. అర్జున్ రెడ్డి చిత్రం త‌మిళంలో వ‌ర్మ అనే టైటిల్‌తో రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఆ మూవీ ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో ఈ సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసి త్వ‌ర‌లో ఫ్రెష్‌గా స్టార్ట్ చేశారు. ఆదిత్మ వ‌ర్మ అనే టైటిల్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

3915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles