విశాల్ 'పందెంకోడి 2' ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,September 29, 2018 12:08 PM

మాస్ హీరో విశాల్ 15 ఏళ్ల క్రితం పందెం కోడి చిత్రంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో ఈ హీరోకి మార్కెట్ తీసుకొచ్చిన సినిమా ఇదే. లింగుస్వామి తెర‌కెక్కించిన ఈ చిత్రం విశాల్ కెరీర్‌కు పునాదులు వేసింది. ఈ పునాదిపైనే మ‌నోడు ఇండ‌స్ట్రీలో త‌న‌కు కావాల్సిన సౌధాన్ని నిర్మించుకున్నాడు . మీరా జాస్మిన్ క‌థానాయిక‌గా న‌టించిన పందెం కోడి చిత్రం బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా పందెం కోడి 2 తెర‌కెక్కుతుంది. త‌మిళంలో ఈ చిత్రం సంద‌కోళి 2 పేరుతో విడుద‌ల కానుంది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ లేడి విల‌న్‌గా క‌నిపించ‌నుంది. యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై విశాల్‌, ధావల్‌ జయంతిలాల్‌, అక్షయ్‌ జయంతిలాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో విశాల్ ర‌ఫ్ఫాడించాడు. కీర్తి సురేష్ త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. లేడి విల‌న్ గెట‌ప్‌లో వ‌ర‌ల‌క్ష్మీ లుక్ అదిరిపోయింది. ద‌స‌రా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయ‌నున్నారు. ట్రైల‌ర్ చూస్తుంటే సీక్వెల్ కూడా మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని అభిమానులు అనుకుంటున్నారు.


1953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles