పందెం కోడి 2 మేకింగ్ వీడియో విడుద‌ల‌

Sat,October 13, 2018 10:53 AM

లింగుస్వామి ద‌ర్శక‌త్వంలో విశాల్‌, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం సంద‌కోళి 2. తెలుగులో ఈ మూవీ పందెం కోడి 2 పేరుతో విడుద‌ల కానుంది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ చిత్రంలో లేడి విల‌న్‌గా క‌నిపించ‌నుంది. యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై విశాల్‌, ధావల్‌ జయంతిలాల్‌, అక్షయ్‌ జయంతిలాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లై మంచి రెస్పాన్స్ సాధించింది. ట్రైల‌ర్‌లో విశాల్ ర‌ఫ్ఫాడించగా, కీర్తి సురేష్ త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. లేడి విల‌న్ గెట‌ప్‌లో వ‌ర‌ల‌క్ష్మీ లుక్ కేక పుట్టించింది. జాతర లో పులి వేషాలు వేయొచ్చు..కానీ పులి ముందే వేషాలు వేయకూడదు అనే డైలాగ్ అదిరిపోయింది. ద‌స‌రా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీపై ఆస‌క్తి పెంచేలా మేక‌ర్స్ ప‌లు వీడియోస్ విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా మేకింగ్ వీడియో విడుద‌ల చేయగా, ఇది అభిమానులని ఆక‌ట్టుకుంటుంది. మీరు వీడియోపై ఓ లుక్కేయండి.


1357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles