సామ్రాట్‌కి నోటీసులు.. త‌నీష్‌, కౌశ‌ల్‌కి క్లాసులు

Sun,August 5, 2018 07:37 AM
samrat gets court notice

బిగ్ బాస్ సీజ‌న్ 2 ఎపిసోడ్ 56 నాని గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభ‌మైంది. దంచ‌వే మేన‌త్త కూతురా అనే సాంగ్‌తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాని శుక్ర‌వారం ఏం జ‌రిగిందో నా..నీ.. టీవీలో చూపించాడు. ముందుగా క‌న్ఫెష‌న్ రూంలోకి సామ్రాట్‌ని పిలిచిన బిగ్ బాస్‌.. కౌశ‌ల్‌కి కోర్టు నుండి నోటీసులు వచ్చాయ‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని ఇంటి స‌భ్యులు ఎవ‌రికి చెప్ప‌కుండా బ‌య‌ట‌కి వెళ్ళి, ప‌ని పూర్తైన త‌ర్వాత బిగ్ బాస్ హౌజ్‌కి తిరిగి రావ‌ల‌సి ఉంటుంద‌ని అన్నారు. సామ్రాట్ భార్య గ‌తంలో త‌న‌పై పెట్టిన వేధింపుల కేసు కొన్నేళ్ళుగా కోర్టులోనే ఉంది. తాజాగా కేసుకి సంబంధించి నోటీసులు రావ‌డంతో సామ్రాట్ కోర్టుకి హాజ‌ర‌య్యేందుకు బ‌య‌ట‌కి వెళ్ళ‌నున్నారు. ఇక ఆ త‌ర్వాత పూజా గేమ్ ప్లానింగ్‌, ఆమె తీసుకున్న నిర్ణ‌యాలు ది బెస్ట్‌గా ఉన్నాయ‌ని కౌశ‌ల్‌.. నూత‌న్ నాయుడుతో చెప్పుకొచ్చారు,

బిగ్ బాస్ హౌజ్‌లో ఈ వారం స‌ర్‌ప్రైజింగ్ విష‌యాల గురించి ప్ర‌స్తావించాడు నాని. మీ చిన్న‌ప్ప‌టి ఫోటోలు , లోకనాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ఇంట్లోకి వ‌చ్చి అంద‌రితో స‌ర‌దాగా స్పెంట్ చేయ‌డం ఎలా అనిపించింద‌ని అడిగాడు. ఎలిమినేట్ అయిన శ్యామ‌ల‌, నూత‌న్ నాయుడు రీ ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంట‌ని కూడా ప్ర‌శ్నించాడు. ఆ తర్వాత టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న నంబ‌ర్ బోర్డ్స్ ని సెల‌క్ట్ చేసుకున్న అంశం గురించి ప్ర‌స్తావించాడు. బిగ్ బాస్ విన్న‌ర్‌గా నిల‌వాల‌నే కోరిక ఉన్న మీరు ఒక‌టో నెంబ‌ర్ బోర్డ్ సెల‌క్ట్ చేసుకోకుండా వేరు వేరు నెంబ‌ర్స్ ఎంపిక చేసుకోవ‌డం వెనుక ఉన్న అంత‌ర్య‌మేమిట‌ని అడిగాడు. దానికి గీతా మాధురి, బాబు గోగోనేని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

ఇక క‌మ‌ల్ హాస‌న్ త‌ను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మంకి రావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన నాని విశ్వ‌రూపం2 సెట్‌కి వెళ్లిన‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి వివ‌రించాడు. త‌ను న‌టిస్తున్న దేవదాస్ కార్యక్ర‌మంకి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఉన్న వ్య‌క్తి విశ్వ‌రూపం 2కి కూడా పని చేయ‌డంతో ఆయ‌న ద్వారా సెట్‌కి వెళ్లి క‌మ‌ల్‌ని క‌లిసిన‌ట్టు తెలిపాడు నాని. ఈగ చిత్రం ద్వారా త‌న‌ని అంద‌రికి ప‌రిచ‌యం చేసిన రాజ‌మౌళికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక బిగ్ బాస్ నానికి కూడా సర్‌ప్రైజ్ ఇచ్చారు. త‌న చిన్న నాటి ఫోటోల‌ని స్క్రీన్‌పైన ప్ర‌జెంట్ చేశారు. ఇది చూసి నాని గ‌త స్మృతుల‌ని నెమ‌ర‌వేసుకున్నాడు.

ఎప్ప‌టిలాగానే ఇంటి స‌భ్యులుగా ఉన్న‌ ఒక్కొక్కరికి వారంలో జ‌రిగిన త‌ప్పొప్పుల గురించి వివ‌రిస్తూ వ‌చ్చాడు నాని. ముఖ్యంగా కౌశ‌ల్ ఆడిన పైరేట్స్ టాస్క్‌లో త‌ను ఫ్లిఫ్ చేయ‌డానికి వ్య‌తిరేఖం అని చెబుతూనే మ‌ళ్ళీ ఫ్లిప్ చేయ‌మ‌ని చెప్ప‌డం త‌ప్పంటూ ఆయ‌న‌పై కొన్ని అక్షింత‌లు వేశాడు నాని. బ‌యట నీకు మంచి పేరు ఉంది. క‌న్ఫ్యూజ‌న్‌లో త‌ప్పులు చేస్తూ దానిని పోగొట్టుకోవొద్ద‌ని హెచ్చ‌రించాడు. ఇక త‌నీష్ ఓదార్పు యాత్ర‌ల గురించి ప్ర‌స్తావించిన నాని ఇంట్లో కొంద‌రిని మాత్ర‌మే చాలా ప్రేమ‌గా ఓదారుస్తావు, మిగ‌తా వారి విష‌యంలో అలా ఉండ‌వెందుకు అంటూ త‌నీష్‌కి చిన్న‌పాటి క్లాస్ పీకాడు. బిగ్ బాస్ హౌస్‌లో నువ్ కౌగిలించుకుని చేసే ఓదార్పుని ఆపితే మంచిది అని అన్నారు నాని

భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో నేచుర‌ల్ స్టార్ బిరుదు నాకొస్తే, నీకు నామినేష‌న్ స్టార్ బిరుదు వ‌చ్చింద‌ని గ‌ణేష్ పేరు ప్ర‌స్తావిస్తూ మాట్లాడారు నాని. జైలులో ఉన్న త‌న‌ని కౌశ‌ల్ బ‌య‌ట‌కి తీసుకురావ‌డంపై గ‌ణేష్‌ అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై నాని మాట్లాడ‌గా దానికి గ‌ణేష్ త‌డ‌బ‌డ‌కుండా మాట్లాడాడు. హౌజ్‌లోకి వ‌చ్చిన 50 రోజుల త‌ర్వాత తొలిసారి ఇంత బాగా మాట్లాడావు. ఈ విష‌యంలో గ‌ణేష్‌కి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు నాని. అంద‌రితో మాట్లాడిన నాని దీప్తి సున‌య‌న‌తో మాట్లాడేందుకు ఈ వారం ఆసక్తి చూప‌లేదు. ఇక ఈ వారం ముఖ్య ఘ‌ట్టం ఎలిమినేష‌న్ టైం వ‌చ్చింద‌ని చెప్పిన నాని.. బాబు గోగినేని, కౌశ‌ల్ ఇద్ద‌రిని ప్రొటెక్టెడ్ జోన్‌లో ప‌డేశాడు. నందిని, దీప్తి, గ‌ణేష్ ల‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే విష‌యాన్ని నేటి (ఆగ‌స్ట్ ) ఎపిసోడ్‌లో చెబుతానని అంటూ ప్యాక‌ప్ చెప్పేశారు.

4019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles