కెప్టెన్సీ కోసం అమ్మాయిలా మారిన సామ్రాట్‌

Thu,August 2, 2018 08:29 AM
samrat generated full fun in bigg boss

బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మంలో భాగంగా మంగ‌ళ‌వారం( ఎపిసోడ్ 51), బుధ‌వారం (ఎపిసోడ్ 52)ల‌లో ఇంటి స‌భ్యులు పైరేట్స్ వ‌ర్సెస్ స‌ర్వైవ‌ర్స్ అనే టాస్క్‌ని అద్భుతంగా ఆడారు. మంగ‌ళవారం రోజు స‌ర్వైవ‌ర్స్‌గా ఉన్న వారు బుధ‌వారం స‌ర్వైవ‌ర్స్‌గా ఉన్న వారికంటే అద్భుతంగా ఆడ‌డంతో బిగ్ బాస్ మంగ‌ళ‌వారం స‌ర్వైవ‌ర్స్‌గా ఉన్న వారిని విజేత‌లుగా ప్ర‌క‌టించారు. ఇక ఆ త‌ర్వాత‌ స‌ర్వైవ‌ర్స్ వ‌ర్సెస్ పైరేట్స్ టాస్క్‌లో ఎవ‌రు బాగా ఆడారో ఇంటి స‌భ్యులు డిసైడ్ చేసి చెప్పాల‌ని బిగ్ బాస్ ఆదేశించ‌డంతో అంద‌రు క‌లిసి పూజా, రోల్‌రైడాల‌ని బెస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్స్‌గా ఎంపిక చేశారు. ఇక చెత్త ప‌ర్‌ఫార్మ‌ర్స్‌గా గీతా మాధురి, సామ్రాట్‌, గ‌ణేష్ ల‌ని ఎంపిక చేశారు. గేమ్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన పూజా, రోల్ రైడాలు ఈ వారం కెప్టెన్ పోటీదారులుగా ఉంటున్నట్టు ప్రకటించారు బిగ్ బాస్.

బెస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్స్‌గా ఎంపికైన పూజా, రోల్ రైడాల‌లో ఒక‌రు చోటా బాస్‌గా, మ‌రొక‌రు ఎకౌంటెంట్‌గా ఉండాల‌ని బిగ్ బాస్ అన్నారు. దీంతో చోటా బాస్‌గా రోల్ రైడా, ఎకౌంటెంట్‌గా పూజా బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఇక చెత్త ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చిన గీతా మాధురి,గ‌ణేష్‌, సామ్రాట్‌లు రోల్‌కి, పూజాకి సేవ‌కులుగా ఉంటారని, ఈ ముగ్గురిలో ఎవ‌రైతే చోటా బాస్‌ని, ఎకౌంటెంట్‌ని మెప్పించి ఎక్కువ డ‌బ్బులు సంపాదిస్తారో వారు కెప్టెన్ పోటీ దారునిగా ఉంటార‌ని ,మిగిలిన ఇద్దరు జైల్‌లో ఉండాల్సి వస్తుందని ట్విస్ట్ పెట్టారు బిగ్ బాస్.

కెప్టెన్ పోటీదారునిగా నిలిచేందుకు సామ్రాట్ అమ్మాయిగా మారితే, గ‌ణేష్ లుంగీ క‌ట్టి మాస్‌లుక్‌లోకి వ‌చ్చాడు. ఇక గీతా మాధురి ఏ విష‌యాన్నైన గ‌ట్టిగా చెబుతూ పోటీలో నిలిచేందుకు ప్ర‌య‌త్నిచింది. ముఖ్యంగా సామ్రాట్ అమ్మాయి గెట‌ప్‌లో ఒదిగి పోయి బాబు గోగినేని, అమిత్‌ల‌తో రొమాన్స్ చేస్తూ హాస్యం పండించాడు. డియో డియో డిసక డిసక అనే సాంగ్‌కి స్టెప్పులు కూడా ఇర‌గ‌దీసాడు సామ్రాట్. గీతా, గణేష్ ల‌ కంటే సామ్రాట్.. చోటా బాస్‌, అకౌంటెంట్‌లని బాగా అలరించడంతో అందరికంటే సామ్రాట్ కి ఎక్కువ డబ్బులు ఇచ్చారు పూజా, రోల్ రైడాలు. దీంతో మ‌రో కెప్టెన్ పోటీ దారుడిగా సామ్రాట్ ఎంపిక అయ్యారు. అయితే సేవ‌కులుగా ఉన్న వారిలో గణేష్ 34 వేలు సంపాదించగా.. గీతా మాధురి 25 వేలు.. సామ్రాట్ 40 వేలు సంపాదించారు.

చోటా బాస్‌, ఎకౌంటెంట్‌ల‌ని మెప్పించ‌లేని వారు జైలులో ఉండాల‌ని ముందుగానే బిగ్ చెప్ప‌డంతో గ‌ణేష్‌, గీతా మాధురిలు జైలుకి వెళ్ళారు . గ‌ణేష్‌ని త‌న వ‌ద్ద ఉన్న జైల్ కార్డ్ ద్వారా తీసుకురావాల‌ని కౌశ‌ల్ భావించాడు. ఇందుకు బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేసి గ‌ణేష్‌ని బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చారు. దీనికి గ‌ణేష్ ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు. నన్ను అడ‌గ‌కుండా మీరు ఎలా విడిపిస్తారు అని ప్ర‌శ్నించాడు. దీనికి కౌశ‌ల్ స‌మాధానం ఇస్తూ.. నీకు ఇబ్బంది ఉంటుందేమో అని విడిపిస్తే ఇలా మాట్లాడుతున్నావేంట‌ని అన్నాడు. మ‌ధ్య‌లో పూజా కూడా క‌ల్పించుకొని ఎవరికోసం జైలు కార్డ్ ఉపయోగించాలన్నది కౌశల్ ఇష్టం, అది మీకు సంబంధం లేదు అని అనడంతో గణేష్ సైలెంట్ అయ్యారు. మొత్తానికి 53వ ఎపిసోడ్‌లో సామ్రాట్ సోలో ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌రగొట్ట‌గా మిగ‌తా వారు క‌డుపుబ్బ న‌వ్వుకున్నారు.

బిగ్ బాస్ సీజ‌న్ 2 లో రెండో ఎలిమినేట‌ర్‌గా హౌజ్ నుండి వెళ్లిపోయిన నూత‌న్ నాయుడు ఈ రోజు ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లో అడుగుపెట్ట‌నున్నాడు. ఈ సారి ప్రేక్ష‌కుల‌కి త‌ప్ప‌క అల‌రిస్తాన‌ని మాట ఇచ్చిన నూత‌న్ నాయుడు ఎలాంటి వ్యూహాల‌తో త‌న గేమ్‌ని ఆడ‌తాడో అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

3793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles