సంపూ మూవీ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

Sat,May 13, 2017 06:06 PM
sampoornesh virus audio release date confirmed

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం కొబ్బరి మట్ట చిత్రం తో పాటు వైరస్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. శివ రామకృష్ణ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో గీత్ షా కథానాయికగా నటిస్తుంది. మే 20న మీనాక్షి భుజంగ్ సంగీతం అందించిన పాటలను విడుదల చేస్తున్నట్టు టీం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మ్యాంగో మీడియా ఆడియో రైట్స్ దక్కించుకుంది. వైరస్ చిత్ర టీజర్ ఇటీవల విడుదల కాగా , దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కి మిలియన్ కి పైగా వ్యూస్ దక్కాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఔట్ అండ్ ఔట్ కామెడీ తో పాటు మర్డర్ కి సంబంధించిన మిస్టరీ కూడా ఉంటుందని సమాచారం.


1414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles