స‌క్సెస్ టూర్ మొద‌లు పెట్టిన సంపూ

Sat,August 17, 2019 12:02 PM
Sampoornesh Babu Kick Starts His Success Tour

ఎన్నో అవాంత‌రాల‌ని దాటి ఆగ‌స్ట్ 10న విడుద‌లైన చిత్రం కొబ్బరి మ‌ట్ట‌. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టించిన ఈ చిత్రంకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. సంపూ మార్క్ డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త‌ ఉత్సాహాన్ని అందించాయి. ఆయ‌న చెప్పిన నాన్‌స్టాప్ డైలాగ్స్‌కి సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తుంది. పాపారాయుడు, పెద రాయుడు, ఆండ్రాయుడ్ ఇలా మూడు పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేశాడు సంపూ . చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న క్ర‌మంలో సంపూర్ణేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో నేడు రేపు విజయయాత్రలు చేయనున్నారు. కొబ్బరిమట్ట ప్రదర్శించబడుతున్న ఆయా థియేటర్లకు వెళ్లి నేరుగా అభిమానులను కలవనున్నారు. ఈ విష‌యాన్ని సంపూర్ణేష్ బాబు ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. ఈ రోజు క‌ర్నూల్‌, అనంత‌పూర్‌, పొద్దూటూర్‌కి వెళ్ళ‌నున్న సంపూ అండ్ టీం రేపు తిరుప‌తి, నెల్లూరు, కావ‌లిలో విజ‌యయాత్ర చేప‌ట్ట‌నున్నారు. రోనాల్డ్ రూపక్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్ నీలం నిర్మించారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు స్టీవ్ శంకర్ సమకూర్చడం జరిగింది.

1931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles