ముగ్గురు భార్యలున్న .. ఒక మనసున్న భర్త కథ

Tue,May 9, 2017 05:33 PM
SAMPOORNESH BABU birthday poster

హృదయ కాలేయం చిత్రంలో తన కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం కొబ్బరి మట్ట అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. ఈ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికి, ఇంకా ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూనే ఉంది. ఆ మధ్య చిత్రానికి సంబంధించి ఓ టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో పెదరాయుడు గెటప్‌తో కనిపించిన సంపూ ఆడవాళ్ళ గురించి చెప్పిన నాన్‌స్టాప్ డైలాగ్ అందరిని అలరించింది.

ఇక ఈ రోజు సంపూర్ణేష్ బర్త్ డే సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్ర టీం సంపూకి బర్త్ డే విషెస్ చెబుతూ ముగ్గురు భార్యలతో కలిసి ఉన్న పెదరాయుడు ఫోటోని విడుదల చేసింది. ఈ ఫోటోని సంపూర్ణేష్ తన సోషల్ మీడియా పేజ్ లో ముగ్గురు భార్యలున్న .. ఒక మనసున్న భర్త కథ అంటూ పోస్ట్ చేశాడు.ఈ పొస్టర్ ఎంతగానో అలరిస్తుంది. త్వరలోనే కొబ్బరి మట్ట చిత్రం ఆడియో వేడుకని నిర్వహించి కొద్ది రోజుల గ్యాప్ తో మూవీని రిలీజ్ చేయాలనే ఆలోచనలో టీం ఉంది.

2924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles