తుఫాను బాధితుల‌కి సంపూ సాయం

Sun,October 14, 2018 07:41 AM
sampoo helps to cyclone victims

ఎలాంటి సపోర్ట్ లేకుండా కేవలం తన టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంపూ బర్నింగ్ స్టార్ గా అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కేవలం నటనతోనే కాకుండా సోషల్ సర్వీస్ ద్వారాను అనేక మంది హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు .ఆ మ‌ధ్య సిద్దిపేట్ లోని గాడిచెర్లపల్లి గ్రామంలో పేద మ‌హిళ ఆరోగ్య ప‌రిస్థితి బాలేద‌ని తెలుసుకున్న సంపూ ఆమెకి ప‌దివేలు సాయం చేశాడు. తమిళనాడు వరద భాదితులను ఆదుకునేందుకు 50 వేలు త‌న వంతు సాయం చేశాడు. ఇక త‌న తాజా చిత్రం కొబ్బరి మట్ట షూటింగ్ లో భాగంగా వెస్ట్ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు సమీపంలోని అరటికట్ల గ్రామంకి వెళ్లి అక్కడి విద్యార్ధులకు కొన్ని హామీలు ఇచ్చాడు. స్కూల్ విద్యార్ధుల ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ...టాప్ ర్యాంక్ సాధించే బాలురకు రూ.10,000, బాలికలకు 15,000 ఇస్తానని విద్యార్థులకు మాట ఇచ్చాడు. తాజాగా శ్రీకాకుళం జిల్లాని వ‌ణికిస్తున్న తిత్లి తుఫాన్ వ‌ల‌న నిరాశ్ర‌యుల‌యిన వారిని ఆదుకునేందుకు త‌న వంతు సాయంగా రూ.50,000/- ముఖ్యమంత్రి గారి సహాయనిధి కి అందజేస్తాను అంటూ ట్వీట్‌లో తెలిపారు. సంపూ దాతృత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.3480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS