సన్ స్ట్రోక్ తో స్పృహ కోల్పోయిన సంపూర్ణేష్ బాబు ?

Wed,March 23, 2016 12:52 PM
sampoo gets a problem

ఈ సమ్మర్‌లో భానుడు భగ భగమంటున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇప్పటికే కొందరు సూర్యుని ప్రతాపానికి భయపడి తమ పనులను వాయిదా వేసుకుంటున్నారు. అయితే తాజగా ఈ భానుడి ఉగ్ర రూపానికి క్రేజీ కమెడీయన్‌ స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో షూటింగ్‌ కూడా నిలిపి వేశారు.

హృదయ కాలేయం అనే వెరైటీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇప్పుడు క్రేజీ స్టార్‌గా మారిన కామెడీ హీరో సంపూర్ణేష్‌ బాబు. తనదైన కామెడీతో , భారీ పంచ్‌ డైలాగులతో , వెరైటీ స్ఫూఫ్‌లతో అలరిస్తున్న సంపూ ఇప్పుడు కొందరు దర్శకులకు గోల్డెన్‌ బిస్కెట్‌లా మారాడు. తను చేసిన ప్రతీ సినిమాలోను ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తూ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాడు ఈ బర్నింగ్‌ స్టార్‌

ఈ వేసవిలో భానుడు ఉగ్ర రూపం సామాన్య ప్రజలనే కాదు సెలబ్రిటీలను వణికిస్తుంది. భయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కాని షూటింగ్‌ ఉన్న సమయంలో తప్పని సరిగా లొకేషన్‌కు హాజరు కావలసిన పరిస్థితి. ఈ సందర్భంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వడదెబ్బ ప్రభావానికి గురవుతున్నారు. పవన్‌ మూవీ షూటింగ్‌ ఇటీవల మండే ఎండలలో నాన్‌ స్టాప్‌గా జరిగింది. దీంతో పవన్‌ కూడా కాస్త సిక్‌ అయినట్టు సమాచారం. ఇప్పుడు సంపూర్ణేష్‌ కూడా ఇదే వేసవి ప్రతాపానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి.

సంపూర్ణేష్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న కొబ్బరి మట్ట చిత్రం ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు దగ్గరలోని నరసాపురంలో జరుగుతుంది. ఇక్కడ ఓ పాటను తెరకెక్కిస్తుండగా, షూటింగ్‌లో ఉన్న సంపూ సన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడు. దీంతో వాంతి చేసుకొని స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తుంది. వెంటనే చిత్ర యూనిట్‌ షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసుకొని హైదరాబాద్‌ కు వచ్చినట్టు సమాచారం. అయితే సంపూకి ఎలాంటి ప్రమాదమేమి లేదని ఇన్‌సైడ్‌ న్యూస్ . సంపూ నటిస్తున్న కొబ్బరి మట్ట చిత్రానికి 'ది లీవ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ అనే సబ్‌ టైటిల్‌ ఉండగా ఇందులో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్‌ అనే మూడు పాత్రలలో కనిపించబోతున్నాడు

2388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles