ఫస్ట్‌ లుక్ పై పంచ్‌ వేసిన సంపూర్ణేష్‌

Sat,May 21, 2016 12:13 PM
sampoo coments on janata garage look

చక్కని కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కమెడీయన్ కమ్‌ హీరో సంపూర్ణేష్‌ బాబు. హృదయ కాలేయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బర్నింగ్‌ స్టార్‌ పర్‌ఫెక్ట్‌ టైంలో పంచ్‌లు వేస్తూ అందరిని కడుపుబ్బ నవ్విస్తున్నాడు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్ 26వ చిత్రం జనతా గ్యారేజ్ ఫస్ట్‌ లుక్ పై ట్వీట్‌ చేసి యంగ్‌ టైగర్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. బృందావనం’ సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ ను అనుకరిస్తూ “సైడ్ యాంగిల్ లో ఉన్నాడు, సైడ్ అయిపోతాడేమో అనుకున్నారేమో, నేరుగా ఫేస్ చేసే దమ్ము నీకోచ్చినప్పుడు విశ్వరూపమే” అంటూ ట్వీట్ చేసి జూనియర్ అభిమానులను మరింతగా ఉత్సాహపరిచాడు సంపూ. మరి సంపూ ట్వీట్‌ అంతరార్ధం పరిశీలిస్తే జనతా గ్యారేజ్ చిత్రం రికార్డులు క్రియేట్‌ చేస్తుందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పినట్టు అర్ధమవుతుంది.

4385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles