వైర‌ల్‌గా మారిన విక్ర‌మ్ 'సామి 2' ఫోటోలు

Fri,April 6, 2018 10:09 AM
sammy 2 pics goes viral

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్. ఇటీవ‌ల‌ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా పూర్తి చేశాడు. ఇందులో జాన్ అనే గూడా ఛారి పాత్రలో విక్రమ్ క‌నిపించాడు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది . ఇక విక్ర‌మ్ ప్ర‌స్తుతం సామికి సీక్వెల్ లో న‌టిస్తున్నాడు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ సామి చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం హరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. విక్రమ్ సరసన కథానాయికలుగా కీర్తి సురేష్, త్రిషలని ఎంపిక చేయగా, బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందనుంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్ సామి2 ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇవి విక్ర‌మ్ ఫ్యాన్స్ ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ఈ మూవీ త‌ర్వాత‌ డోంట్ బ్రీత్ అనే హాలీవుడ్ మూవీని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు విక్ర‌మ్.2471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles