అఫీషియల్: విక్రమ్ సామి2 కాస్ట్ అండ్ క్రూ

Wed,September 20, 2017 04:08 PM
sammy 2 cast and crew

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్ అనే గూడా ఛారి పాత్రలో విక్రమ్ కనిపించనుండగా, ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ ఆడియన్స్ లో ఫుల్ హైప్ తెస్తున్నాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉన్న విక్రమ్ ని చూసి అభిమానులు... తమ అభిమాన హీరోని హాలీవుడ్ హీరోతో పోల్చుకుంటున్నారు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది . విక్ర‌మ్ సామికి సీక్వెల్ లో కూడా నటించనున్నాడని అప్పట్లోనే ప్రచారం జరిగింది. తాజాగా చిత్ర కాస్ట్ అండ్ క్రూని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ సామి చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం హరి దర్శకత్వంలో తెరకెక్కనుంది. విక్రమ్ సరసన కథానాయికలుగా కీర్తి సురేష్, త్రిషలని ఎంపిక చేయగా, బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందనుంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్ సామి2 ప్రాజెక్ట్ కోసం పని చేయనున్నారు. ఈ నెలాఖరు నుండి సామి2 చిత్రం సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీతో పాటు డోంట్ బ్రీత్ అనే హాలీవుడ్ మూవీని రీమేక్ చేసే ఆలోచనలో విక్రమ్ ఉన్నాడని సమాచారం.

1034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles