కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ట్రైల‌ర్‌

Thu,May 31, 2018 10:18 AM
Sammohanam Theatrical Trailer released

సుధీర్ బాబు .. అదితీ రావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మోహనకృష్ణ ఇంద్రగంటి తెర‌కెక్కించిన చిత్రం సమ్మోహనం . జూన్ 15న విడుద‌ల కానున్న ఈ చిత్రం సినిమా ప్ర‌పంచానికి సంబంధించిన నేప‌థ్యంలో సాగ‌నుంద‌ని తెలుస్తుంది. కృష్ణ పుట్టిన రోజు కావ‌డంతో కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ సినిమా వాళ్ల మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పనుకున్నాను .. నిన్ను కలిసిన తరువాత. కాదని చెంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశావ్ అంటూ సుధీర్ బాబు ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ సినిమాపై అంచ‌నాలు పెంచుతుంది. శ్రీదేవి మూవీస్ బేన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. త్వ‌ర‌లో చిత్ర ఆడియోని విడుద‌ల చేసి సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచాల‌ని టీం భావిస్తుంద‌ట‌. అదితి రావు హైద‌రి స‌మ్మాహ‌నం చిత్రంతో టాలీవుడ్‌కి డెబ్యూ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

3245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles