కృష్ణ ఇంట్లో స‌మ్మోహ‌నం టీం సంబ‌రాలు

Wed,June 20, 2018 11:41 AM
sammohanam success celebrations at krishna home

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రీ జంట‌గా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ . రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్రంలో కుటుంబ బంధాలు, ప్రేమకథకు సినిమా నేపథ్యాన్ని, తారల తెరవెనుక జీవితాల్ని సమ్మిళితం చేసి చూపించారు . వెండితెరపై అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆనందపరిచే తారల జీవితాల్లో మరో పార్శాన్ని ఈ సినిమాలో చూపించారు. తమకు నచ్చినట్లుగా జీవించే క్రమంలో వారు ఎదుర్కొనే సంఘర్షణను హృద్యంగా ఆవిష్కరించారు. అలాగే సినిమా రంగం, తారల జీవితాల పట్ల సగటు ప్రేక్షకుడిలో తలెత్తే అనేక అపోహల్ని ఈ సినిమాలో చర్చించారు. అవన్నీ అవాస్తవాలేనని, సినిమాల్ని ప్రాణంగా ప్రేమించి కష్టపడేవారున్నారని ఇండస్ట్రీలో ఉంటారని చూపించిన విధానం మెప్పిస్తుంది. క్యాస్టింగ్‌కౌచ్, హీరోల ప్రవర్తన కారణంగా కథానాయికలు ఎదుర్కొనే ఇబ్బందులు, సహాయ నటుల కోసం పరాయి భాషల వారిపై ఆధారపడుతున్న తీరు.. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ వాస్తవిక పరిస్థితిని వినోదాత్మక కోణంలో చూపించారు.

ప్ర‌స్తుతం సమ్మోహ‌నం సినిమా స‌క్సెస్ టాక్‌తో దూసుకెళుతుంది. విమ‌ర్శ‌కులు కూడా చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌రోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ కలెక్ష‌న్స్‌తో దూసుకెళుతుంది. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ సూప‌ర్ స్టార్ కృష్ణ ఇంట్లో సక్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నారు. యూనిట్ స‌భ్యుల‌కి కృష్ణ దంప‌తులు మంచి విందు అందించారు. వీటికి సంబంధించిన ఫోటోల‌ని న‌రేష్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. ఇంటి నుండే స‌మ్మోహ‌నం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ మొద‌లుపెట్టాం. ఇంత‌క‌న్నా మంచి ప్ర‌దేశం లేద‌ని భావిస్తున్నాం. సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులు, క్రిటిక్స్‌కి కృతజ్ఞతలు అని కామెంట్ పెట్టారు. విందులో కృష్ణ, విజయ నిర్మలతో పాటు కృష్ణ అల్లుడు, హీరో సుధీర్‌బాబు, దర్శకుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి, నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్, చిత్రంలో కీలక పాత్ర పోషించిన నరేష్ పాల్గొన్నారు.


2058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS