ఎత్తైన పర్వతంపై సమీరారెడ్డి..వీడియో

Mon,September 30, 2019 05:55 PM


బాలీవుడ్ నటి సమీరారెడ్డి జులైలో పండంటి బిడ్డకు పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సమీరా రెడ్డి తన రెండు నెలల కూతురిని ఎత్తుకొని పెద్ద సాహసమే చేసింది. కర్ణాటకలో అతి ఎత్తైనది ముల్లయనగిరి పర్వతం. సమీరా ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేసి ఎంతోమంది తల్లుల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నించింది. పర్వతంపైకి వెళ్తుండగా మార్గమధ్యలో ఓ వీడియో తీసి ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది సమీరా. ఇది 6300 అడుగుల ఎత్తైన పర్వతం. నా కూతురు నైరాతో కలిసి ఎక్కే ప్రయత్నం చేశా. కొన్ని మెట్లు ఎక్కి కొంతదూరం రాగలిగాను ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత ఏ మాత్రం భయపడకుండా తల్లులు మరింత ఎనర్జీతో ముందుకు సాగాలంటూ ఓ సందేశాన్ని పంపింది సమీరా. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

2574
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles