'అంత‌రిక్షం' నుండి మెలోడియ‌స్ సాంగ్ విడుద‌ల‌

Sat,December 1, 2018 08:35 AM
Samayama Lyrical video released

ఘాజీ ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్ర అంత‌రిక్షం. 9000 కెఎంపిహెచ్ అనేది ఉపశీర్షిక. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్‌‌గా ఈ చిత్రంలోని సన్నివేశాలను జీరో గ్రావిటీ సెట్స్‌‌పై చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి టేకింగ్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌గా ‘అంతరిక్షం’ ఉండబోతుందని టీజర్‌లో హిట్ ఇచ్చారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ట్రాయ్, జీరో డార్క్, గేమ్ ఆప్ థ్రోన్స్ వంటి హాలీవుడ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడం మరో విశేషం. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రంకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాలు మొద‌లు పెట్టారు మేక‌ర్స్‌. రీసెంట్‌గా సమయమా.. అదేమిటంత తొందరేంటి ఆగుమా!! సమయమా.. మరింత హాయి పోగు చేయనీయుమా .. సమమయా.. సమయమా.. సమయమా’ అంటూ సాగే మెలోడియ‌స్ సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఈ పాటకి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించ‌గా, హరిణి, యాజిర్ నిహార్‌లు ఆల‌పించారు. ప్రశాంత్ ఆర్. విహారి చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేయ‌నున్నారు.

2102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles