'స‌మ‌ర శంఖం' మోగించిన యాత్ర చిత్ర బృందం

Sun,September 2, 2018 08:34 AM
samara Shankham video song released

టాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా రూపొందుతున్న బ‌యోపిక్స్‌లో యాత్ర ఒకటి. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది. వైఎస్ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి కనిపించ‌నుండ‌గా, వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసారు. ఇక వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్. వైఎస్ జ‌గ‌న్‌గా సూర్య న‌టిస్తార‌ని స‌మాచారం. అనసూయ కూడా చిత్రంలో ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. చిత్ర ద‌ర్శ‌కుడు పాత్ర‌లకి త‌గ్గ‌ట్టు న‌టీన‌టుల‌ని ఎంపిక చేస్తుండంతో సినిమాపై హోప్స్ పెరుగుతున్నాయి. అయితే ఈ రోజు వైఎస్ఆర్ 9వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా స‌మ‌రశంఖం అనే సాంగ్ విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో వైఎస్ఆర్‌లా మ‌మ్ముట్టి ప్ర‌ద‌ర్శిస్తున్న హావ‌భావాల‌ని చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కృష్ణ కుమార్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్ ని క‌ళా భైర‌వ పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు. ఆ సాంగ్ మీరు వినండి.

5083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles