స‌మంత‌- చైతూ సినిమా మొద‌ల‌య్యేదెప్పుడో తెలుసా ?

Fri,July 20, 2018 11:19 AM
samantha,chaitanya new movie started in this month

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత నిన్న‌టి వ‌ర‌కు ఎవ‌రి ప్రాజెక్టుల‌తో వారు బిజీగా ఉన్నారు. చైతూ.. స‌వ్య‌సాచి, శైల‌జా రెడ్డి అల్లుడు వంటి చిత్రాల‌తో బిజీగా ఉంటే స‌మంత ఇటు తెలుగు అటు త‌మిళ ప్రాజెక్టుల‌తో తీరిక లేకుండా టైం గడుపుతుంది. పెళ్ళికి ముందు ఏం మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల‌లో క‌లిసి న‌టించిన స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి శివ నిర్వాణ ప్రాజెక్ట్‌లో హీరో హీరోయిన్‌లుగా న‌టించ‌నున్నారు. చిత్రానికి ప్రేయ‌సి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఎదురుచూస్తుండ‌గా, జూలై 23న మూవీని ప్రారంభించాల‌ని మేక‌ర్స్ డిసైడ్ అయ్యార‌ట‌. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

854
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS