యూ టర్న్ సెట్స్‌లో స‌మంత‌.. ఫోటోలు వైర‌ల్‌

Fri,June 15, 2018 08:30 AM
samantha u turn remake photoes goes viral

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న స‌మంత న‌టిస్తున్న తాజా చిత్రం యూ ట‌ర్న్‌. కన్నడ మూవీ ‘యూ టర్న్‌’ ను అదే పేరుతో తమిళ, తెలుగు భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు . కన్నడలో తెరకెక్కించిన పవన్‌ కుమార్‌ ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మ‌హాన‌టి చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ మ‌ధుర‌వాణిగా క‌నిపించిన‌ స‌మంత ఈ చిత్రంలోను పాత్రికేయురాలిగా క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న యూ ట‌ర్న్ చిత్రంతోను స‌మంత మెప్పించ‌నుంద‌ని టీం చెబుతుంది. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతున్న ఈ చిత్రంలో భూమిక .. ఆది పినిశెట్టి.. రాహుల్ ర‌వీంద్రన్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

లో బ‌డ్జెట్‌తో రీమేక్ చిత్రం రూపొందుతుండ‌డం వ‌ల‌న స‌మంత యూట‌ర్న్ రీమేక్‌కి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేదట‌. సినిమా లాభాల్లో వాటా ఇచ్చేలా మాట్లాడుకుంద‌ని స‌మాచారం. ఇక ఈ సినిమా లొకేష‌న్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ద‌ర్శ‌కుడు స‌మంత‌, ఆది పినిశెట్టికి సీన్ వివ‌రిస్తున్న‌ట్టు ఫోటోలని చూస్తుంటే అర్ద‌మ‌వుతుంది. స‌మంత ఇటీవ‌ల సూప‌ర్ డీల‌క్స్ అనే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకోగా, శివ కార్తికేయ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న సీమ రాజా అనే చిత్రం చేస్తుంది. వీటితో పాటు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో త‌న భ‌ర్త చైతూ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

3626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS