మ‌రో లేడి ఓరియెంటెడ్ చిత్రంలో స‌మంత‌ ..!

Wed,September 26, 2018 11:54 AM
Samantha to team up with Nandini Reddy

ఇటివ‌లి కాలంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలకి ఆదరణ మరింత పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో అనుష్క, నయనతార, త్రిష వంటి భామలు ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. రీసెంట్‌గా యూట‌ర్న్ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంతో అల‌రించిన స‌మంత మ‌రోసారి క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేయాల‌నుకుంటుంద‌ట‌. ఈ చిత్రం 'అలా మొదలైంది', 'కల్యాణ వైభోగమే' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే నందిని.. సామ్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ ఏడాది స‌మంత న‌టించిన రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, అభిమ‌న్యుడు, సీమ‌రాజా, యూ ట‌ర్న్ వంటి చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ చిత్రంపై అభిమానులల‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌ చైతూతో క‌లిసి స్పెయిన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మంత హైద‌రాబాద్‌కి రాగానే త‌న భ‌ర్త‌తో క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ మూవీ షూటింగ్‌లో పాల్గొన‌నుంది. ఈ మూవీ పూర్తైన త‌ర్వాత నందినీ రెడ్డి చిత్రం చేయ‌నుంద‌ని అంటున్నారు.

1269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles