టెర్ర‌రిస్ట్‌గా మార‌నున్న స‌మంత‌..!

Tue,November 12, 2019 08:29 AM

కెరీర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న అందాల బొమ్మ సమంత‌. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం 96 రీమేక్ చిత్రంతో పాటు ఒక వెబ్ సిరీస్‌లో న‌టిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తైన త‌ర్వాత స‌మంత కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. అయితే 10 అనే సినిమాలో కాస్త నెగెటివ్ పాత్ర పోషించిన స‌మంత మ‌ళ్ళీ విల‌న్ అవ‌తారం ఎత్త‌లేదు. కాని ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో ఓ నెగెటివ్ పాత్ర పోషిస్తుంద‌ట స‌మంత‌. ఆ పాత్ర మ‌రెదో కాదు టెర్ర‌రిస్ట్ అని అంటున్నారు.


మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైంది. మొత్తం 10 ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాపులర్ హిందీ వెబ్ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్‌ను తీస్తున్నారు. అదే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. మొదటి సిరీస్‌కు మించి రెండో సిరీస్ రూపొందుతుండ‌గా, ఇటీవ‌లే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొద‌లు పెట్టారు. త్వ‌ర‌లోనే స‌మంత వెబ్ సిరీస్ టీంతో జాయిన్ కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో స‌మంత పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

1371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles