ఆర్ఎక్స్ 100 దర్శకుడి చిత్రంలో సమంత..?

Wed,March 6, 2019 07:20 PM
samantha to part of RX 100 Director Mahasamudram Movie?


ఆర్ఎక్స్ 100 చిత్రంతో బాక్సాపీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు అజయ్ భూపతి. ఈ దర్శకుడు తన తర్వాతి సినిమాకు మహా సముద్రం అనే టైటిల్ ను ఖరారు చేశాడు. మల్టీ స్టారర్ గా రానున్న ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం హీరోయిన్ సమంతను ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యాడట అజయ్ భూపతి. ఇటీవలే అజయ్ సమంతతో ఈ విషయమై సంప్రదింపులు కూడా జరిపినట్లు ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ప్రాజెక్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తోపాటు మరో హీరో కూడా నటించనున్నట్లు టాక్. అజయ్ భూపతి ఈ సినిమాలో రెండో హీరోను కూడా వెతికే పనిలో ఉన్నాడని సమాచారం. విశాఖపట్నం నుంచి జరుగుతున్న అక్రమ రవాణాల నేపథ్యంలో మహా సముద్రం కథ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే అజయ్ భూపతి ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాలి మరి.

1761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles