ఈ సారి శూర్పణఖగా క‌నిపించ‌నున్న స‌మంత‌ !

Wed,October 17, 2018 11:29 AM
samantha to make Shoorpanakha

నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారిన స‌మంత చాలా బాధ్యాయుతంగా మెలుగుతుంది. సినిమాల ప‌రంగా ఆమె ఎంపిక చేసుకునే పాత్ర‌లు ప్రేక్ష‌కుల హృద‌యాలని కొల్ల‌గొట్టేలా ఉంటున్నాయి. ఈ ఏడాది విడుద‌లైన రంగ‌స్థ‌లం చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించిన సామ్ మ‌హాన‌టి, యూ ట‌ర్న్ చిత్రాల‌లో జ‌ర్నలిస్ట్‌గా క‌నిపించి మెప్పించింది. ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌తో క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తుంది. దీనికి మ‌జిలి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇందులో కూడా సామ్ పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ట‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ సినిమాల‌తో మెప్పించిన స‌మంత త్వ‌ర‌లో ఓ పౌరాణిక పాత్రలో నటించేందుకు ఓకె చెప్పారట. అది కూడా నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రగా తెలుస్తోంది. యానిమేష‌న్ చిత్రాలతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భార్గ‌వ్ అనే వ్య‌క్తి త్వ‌ర‌లో రామాయ‌ణం ఆధారంగా సినిమా చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఇందులో శూర్పణఖగా కాజ‌ల్‌ని తీసుకోవాల‌ని అనుకున్నా, చివ‌రికి స‌మంతని ఫైన‌ల్ చేశార‌ట‌. ఈ ప్రాజెక్ట్‌పై ప్ర‌స్తుతం చర్చ‌లు జ‌రుగుతుండ‌గా, అతి త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంది.

2670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS