త‌న‌ని ట్రోల్ చేసే వారికి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన సామ్

Fri,September 28, 2018 10:11 AM

ఈ ఏడాది రంగస్థలం, మహానటి, యూ టర్న్, అభిమ‌న్యుడు వంటి చిత్రాలతో అద్భుత విజ‌యాలు అందుకున్న అక్కినేని కోడ‌లు స‌మంత ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌తో క‌లిసి స్పెయిన్‌లోని ఓ ఐలాండ్‌ ఐబిజాలో ఎంజాయ్ చేస్తుంది. త‌న భ‌ర్త తీసిన కొన్ని ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో నెటిజ‌న్స్ ఆమెపై ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. అందుకు కార‌ణం ఆమె పెళ్లి త‌ర్వాత కూడా ప‌ద్ద‌తిగా దుస్తులు ధ‌రించ‌డం లేద‌ని. అక్కినేని కోడ‌లు అయిన నువ్వు లో దుస్తులు ధరించి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం ప‌ద్ద‌తేనా అంటూ క్లాసులు పీకారు. మరికొంత మంది శృతి మించి ట్రోల్స్ కూడా చేశారు. ఈ క్ర‌మంలో యూట‌ర్న్ యాక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ద‌య‌చేసి మ‌హిళ‌ల‌ని గౌర‌వించ‌డం నేర్చుకోండి అని ట్వీట్ చేశారు. ఇక తాజాగా స‌మంత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ట్రోల్ చేసే వారికి దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చింది ‘‘నేను నా వైవాహిక జీవితం ఎలా బతకాలో చెబుతున్నామని అనుకుంటున్న మీ అందరికి’’ అంటూ.. ఓ సిగ్నల్‌‌ని చూపిస్తూ.. వార్నింగ్ ఇచ్చినట్టుగా పోస్ట్ చేసింది. దీనిపై కొందరు స‌మంత‌ని స‌పోర్ట్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు.3491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles