స్నేహితురాళ్ళ‌తో స‌మంత‌.. ఫోటోలు వైర‌ల్

Thu,April 25, 2019 10:01 AM
samantha spents happy time with friends

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత రీసెంట్‌గా త‌న స్నేహితురాలి వివాహ వేడుక‌కి హాజ‌రైంది. క్రైస్త‌వ ప‌ద్ద‌తిలో జ‌రిగిన ఈ వేడుక‌లో త‌న స్నేహితుల‌తో ఆనంద క్ష‌ణాలు గ‌డిపింది సామ్. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్నేహితులు వీరేనంటూ గ్రూప్‌ ఫొటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సామ్‌. ఈ ఫోటోలో అంద‌రు చిరున‌వ్వు చిందిస్తూ క‌నిపించారు. ఇండ‌స్ట్రీలోను స‌మంత‌కి మంచి ఫ్రెండ్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అప్పుడప్పుడు వారితో సాగిస్తున్న స‌ర‌దా సంభాష‌ణ‌కి సంబంధించిన పోస్ట్‌లు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌తో క‌లిసి మ‌జిలీ అనే చిత్రం చేసిన స‌మంత త్వ‌ర‌లో ఓ బేబీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది . ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక త‌మిళంలో సూపర్‌ సక్సెస్ సాధించిన 96 రీమేక్‌లో శ‌ర్వానంద్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. రీసెంట్‌గా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, త్వ‌ర‌లోనే టీంతో క‌ల‌వ‌నుంది సామ్. దిల్ రాజు నిర్మాణంలో 96 తెలుగు రీమేక్ రూపొందుతుంది.

2064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles