అత్త‌ బ‌ర్త్‌డే సెల‌బ్రేషన్స్ వీడియోని షేర్ చేసిన స‌మంత‌

Wed,September 13, 2017 04:16 PM
samantha shares amala birthday celebration video

అక్కినేని నాగార్జున భార్య అమ‌ల సెప్టెంబ‌ర్ 12న త‌న 49వ బ‌ర్త్‌డే వేడుక‌లని స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రుపుకుంది. అమ‌ల బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నాగార్జున స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు. ‘ఐ లవ్యూ స్వీట్‌హార్ట్‌. నీతో కలిసి చాలా కాలం జీవించాలని నాకు నేనే విష్‌ చేసుకుంటున్నా. హ్యాపీబర్త్‌డే’ అని ట్వీట్‌ చేయ‌గా, ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా అమ‌ల‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే నిన్న సాయంత్రం మాజీ న‌టి అమ‌ల బ‌ర్త్‌డే వేడుక తన కుటుంబ సభ్యుల మ‌ధ్య గ్రాండ్‌గానే జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లో అక్కినేని ఇంట కోడ‌లిగా అడుగు పెట్ట‌నున్న స‌మంత .. అమ‌ల బ‌ర్త్‌డే వేడుక‌కి సంబంధించిన వీడియోని సోష‌ల మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. సామ్ షేర్ చేసిన వీడియోలో నాగ చైత‌న్య కూడా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఉన్న అమ‌ల పెళ్ళి తర్వాత గృహిణిగా ఇంటి పనుల్లో నిమగ్నమైంది. బ్లూక్రాస్ సంస్థను స్థాపించి నోరులేని జీవాలకు కారుణ్య దృక్పథంతో సేవలందిస్తోంది. ఇక స‌మంత అక్టోబ‌ర్ 6న చైతూని వివాహం చేసుకోనుంది. ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం 1985, మ‌హాన‌టి, రాజుగారి గది2 ల‌తో పాటు ప‌లు తమిళ చిత్రాల‌తో బిజీగా ఉంది.




3005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS