సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నున్న స‌మంత‌ ?

Fri,July 6, 2018 11:54 AM
samantha says gud bye to movie

ద‌క్షిణాదిలోని టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత ఈ ఏడాది స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళుతుంది. పెళ్లి త‌ర్వాత కూడా త‌న స్పీడ్‌ని కొన‌సాగిస్తూ మంచి హిట్ చిత్రాలతో అభిమానుల‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. ఈ ఏడాది ప్ర‌థ‌మార్దంలో వ‌రుస సినిమాల‌తో బిజీ అయిన స‌మంత మంచి హిట్స్ సాధించింది. రంగస్థలంలో రామలక్ష్మీగా, మహానటిలో మధురవాణిగా, అభిమన్యుడు చిత్రంలో రతీ దేవిగా అద్భుత పాత్రలు పోషించి అలరించింది. అయితే సమంత తొలిసారి డీ గ్లామర్ పాత్ర పోషించిన రామలక్ష్మీ పాత్రకి మాత్రం ఎక్కువ మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సూపర్ డీలక్స్, సీమ రాజా అనే తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. చైతూ ప్రధాన పాత్రలో శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్న సినిమా కూడా చేస్తుంది సామ్. ఇదీ కాక యూ టర్న్ అనే రీమేక్ చిత్రం కూడా చేస్తుంది.

ఫ‌స్టాఫ్‌లో మంచి విజ‌యాలు సాధించిన స‌మంత సెకండాఫ్‌లో త‌న హ‌వా కొన‌సాగించాల‌ని అనుకుంటుంది. ఈ క్ర‌మంలో ఓ వార్త అభిమానుల‌కి షాకింగ్‌గా మారింది. వ‌చ్చే ఏడాది స‌మంత సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నుందంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్ని 2019 మార్చి వ‌ర‌కు పూర్తి చేసి ఆ త‌ర్వాత ఇంటికే పరిమితం అవ్వాల‌ని సామ్ భావిస్తుంద‌ట‌. అయితే కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ప్ర‌క‌టించిన ఆమె రానున్న రోజుల‌లో సినిమాల‌కి నిజంగానే గుడ్ బై చెబుతుందా అని హాట్ హాట్ చర్చ‌లు జ‌రుపుతున్నారు అభిమానులు. పిల్ల‌ల కోస‌మే స‌మంత ఈ నిర్ణ‌యం తీసుకుందా అంటే.. అప్ప‌ట్లో తాము పిల్లల్ని గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు అని చెప్పింది . పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నాం. ఆ సమయం వచ్చేదాకా కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నాం అని సామ్‌ తెలిపింది. మ‌రి ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఈ ప్ర‌చారంపై స‌మంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

6106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles