గోవాలో గ్రాండ్‌గా జ‌రిగిన చైతూ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్

Sat,November 24, 2018 12:26 PM

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు ఎప్పుడు అభిమానుల దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉంటారు. వారిద్ద‌రు క‌లిసి ఏదైన వేడుక‌కి హాజ‌రైన లేదంటే వెండితెర‌పై క‌నిపించిన.. చూడ‌ముచ్చ‌ని జంట అనే కాంప్లిమెంట్ ఇవ్వ‌కుండా ఉండ‌లేరు. చైతూని ఎంత‌గానో ఇష్ట‌ప‌డే స‌మంత నిన్న చైతూ 32వ‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ని గోవాలో గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. చైతూ, సామ్ స్నేహితులు కూడా ఈ సెల‌బ్రేష‌న్‌లో భాగం అయ్యారు. ఇక‌ చైతూ బ‌ర్త్‌డే వేడుక‌ల‌కి సంబంధించిన ఫోటోల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక స‌మంత త‌న ఇన్‌స్టాగ్రాంలో చైతూని గ‌ట్టిగా హ‌గ్ చేసుకొని దిగిన ఫోటోని షేర్ చేస్తూ కామెంట్ పెట్టంది. బ్ల‌ర్ ఆఫ్ గ్రేట్ మ్యాజిక్ అనే కొటేష‌న్ ఆ ఫోటోకి త‌గిలించి, నా ఫ్రెండ్‌, నా గురు, నా ఆత్మ‌, నా కోస‌మే పుట్టిన చైతూకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అని తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం చై-సామ్ క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌జిలి (వ‌ర్కింగ్ టైటిల్ ) అనే సినిమా చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది.
2023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles