మ‌న్మ‌థుడు2లో స‌మంత పాత్ర ఏంటంటే ?

Sun,May 12, 2019 07:22 AM

సినిమా నిర్మాత‌ల‌కి గోల్డెన్ లెగ్‌గా మారిన స‌మంత వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతుంది. ఇప్పుడు నిర్మాత‌లు ఆమెని క‌నీసం గెస్ట్ రోల్‌లో అయిన క‌నిపించ‌మ‌ని అడుగుతున్నారు. స‌మంత మామ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న మ‌న్మ‌థుడు 2 చిత్రంలో సామ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మూవీ చిత్రీక‌ర‌ణ పోర్చుగ‌ల్‌లో జ‌రుగుతుండ‌గా, ఇటీవ‌ల అక్క‌డికి వెళ్లి టీంతో క‌లిసింది. అయితే చిత్రంలో స‌మంత పాత్ర ఏంట‌నే దానిపై కొన్ని రోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా, తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కి వ‌చ్చింది.


మ‌న్మ‌థుడు సినిమాలో నాగార్జున అమ్మాయిల‌కి దూరంగా ఎందుకు ఉంటార‌నేది త‌నికెళ్ళ‌భ‌ర‌ణి చెబుతూ ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ‌తాడు. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2లో అమ్మాయిల‌తో చ‌నువుగా ఉంటాడ‌ట నాగ్‌. ఆయ‌న ఎందుకు అంత చ‌నువుగా ఉంటాడ‌నేది స‌మంత వివ‌రిస్తుంద‌ని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లోకి తీసుకెళ్లే ఈ పాత్ర సినిమాకి కీల‌కం కాబ‌ట్టి స‌మంత‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. చిల‌సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా మ‌న్మ‌థుడు 2 చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ మ‌న్మ‌థుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

1794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles