కొన్ని సంద‌ర్భాల‌లో భ‌యం అనేదే అస‌లైన పరిష్కారం: స‌మంత‌

Fri,December 6, 2019 10:31 AM

దిశ నిందితులని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం ప‌ట్ల సినీ న‌టి స‌మంత త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఈ సంఘ‌ట‌న జరిగిన‌ప్పుడు నేను ఏమి స్పందించ‌లేదు. ఎందుకంటే బాధితుల‌కి నా సంతాపం చెల్లించ‌లేద‌ని ఆరోపిస్తూ , నాకు వ‌చ్చిన ప్ర‌తి సందేశం స‌మాజంలో ఉన్న మ‌హిళ‌ల‌కి నేనేమి చేయ‌లేక‌పోయాన‌నే విష‌యాన్ని గుర్తు చేసింది. దానిని నుండి విడిపించ‌డానికి ఈ ఒక్క ట్వీట్ సరిపోదనిపించింది అని స‌మంత తెలిపింది.


తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో కొంత భయాన్ని మిగ‌తా వారిలో కలిగించారని.. అప్పడప్పడూ ఇలాంటివి అవసరం అని చెప్పింది. అందుకే తెలంగాణ అంటే ప్రేమ అని తెలిపింది

‘నేను తప్పుగా ఏమీ అనుకోవట్లేదు. నేను మరణశిక్షకు వ్యతిరేకిని. కానీ కొన్నేళ్లుగా నేను నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నా. రేపిస్టులను తప్పనిసరిగా ఉరి తీయాలి! మన జాతికి ఉదాహరణగా నిలిచినందుకు, మహిళలపై గౌరవాన్ని చూపినందుకు కేటీఆర్ గారికి థాంక్యూ’’ అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

మా టీజ‌ర్స్ , ట్రైల‌ర్స్ లైక్ చేయిక‌పోయిన ప‌ర్వాలేదు. ద‌య చేసి ఎన్‌కౌంట‌ర్ న్యూస్ ట్రెండింగ్ చేయండి.. ఇలా జ‌రిగింద‌ని చాటింపు చేయండి అని హ‌రీష్ శంక‌ర్ త‌న‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

1894
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles