సమంత సినిమాలకి చిన్న బ్రేక్ ఇవ్వనున్న‌మాట వాస్త‌వ‌మేనా?

Fri,November 8, 2019 01:23 PM

అందం, అభిన‌యం రెండు క‌లగ‌ల‌సిన న‌టి స‌మంత‌. ఈ అమ్మ‌డు 2017 అక్టోబ‌ర్‌లో నాగ‌చైత‌న్య‌ని వివాహం చేసుకుంది. పెళ్ళి త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన స‌మంత మంచి స‌క్సెస్‌లు సాధించింది. ఇటీవ‌ల ఓ బేబి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌మంత ప్ర‌స్తుతం 96 రీమేక్ చిత్రంలో న‌టిస్తుంది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వ‌ర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. శ‌ర్వానంద్ చిత్రంలో కెమెరామెన్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. మ‌రోవైపు `ఫ్యామిలీమెన్-2` వెబ్‌సిరీస్ లోను న‌టిస్తుంది స‌మంత‌. ఇవి పూర్తైన త‌ర్వాత‌ కొద్ది రోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చి మాతృత్వం పొందేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌లో నిజ‌మెంత ఉంద‌నేది చూడాలి.

2244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles