ఎన్టీఆర్‌లో స‌మంత ఏ పాత్ర పోషిస్తుందో తెలుసా ?

Sun,November 18, 2018 11:19 AM
samantha plays special role in sr ntr

విశ్వ విఖ్యాత న‌టసార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు క్రిష్ ఎన్టీఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు పార్ట్‌లుగా రానున్న ఈ చిత్రం జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌కి అమితానందాన్ని క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ సినిమాలోని ముఖ్య పాత్ర‌ల కోసం పలువురు స్టార్స్‌ని ఎంపిక చేసిన చిత్ర బృందం అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌ని ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశార‌ని అంటున్నారు. ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి మెప్పించిన జమున లేదా కాంచన పాత్రల్లో ఏదొక పాత్రలో సమంత నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవ‌ల అనుష్క కూడా ఈ మూవీలో ఓ పాత్ర పోషించనందని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. స‌రోజా దేవి పాత్ర కోసం అనుష్క‌ని తీసుకున్నార‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

2687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles