నాగ్ చిత్రంలో గెస్ట్ రోల్ చేయ‌నున్న సామ్..!

Fri,March 1, 2019 08:28 AM

దేవదాస్ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో చివ‌రిగా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన నాగార్జున త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్‌గా మ‌న్మ‌థుడు 2 చిత్రం చేయ‌నున్నాడ‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. చిల‌సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించ‌నుందట‌. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. మార్చి 12న చిత్రం అఫీషియ‌ల్‌గా లాంచ్ కానుంది. తొలి షెడ్యూల్ పోర్చుగ‌ల్‌లో జ‌ర‌గ‌నుంది. ఎక్కువ శాతం చిత్రీక‌ర‌ణ యూర‌ప్‌లో జ‌ర‌ప‌నున్నారని తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ మ‌న్మ‌థుడు 2 చిత్రానికి సంగీతం అందించనున్నాడని సమాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం చిత్రంలో నాగ్ కోడ‌లు స‌మంత ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది. చిత్రంలో అది కీల‌క పాత్ర కాగా, ఆ రోల్‌కి స‌మంత అయితే బాగుంటుంద‌ని నాగ్ త‌న కోడ‌లిని అడిగాడ‌ట‌. వెంట‌నే సామ్ కూడా ఓకే చెప్పేసింద‌ట‌. సుమారు ఐదు నుండి ప‌ది నిమిషాలు స‌మంత క‌నిపించ‌నున్నార‌ని చెబుతున్నారు. మ‌నం త‌ర్వాత రాజు గారి గ‌ది 2 చిత్రంలో క‌లిసి న‌టించిన స‌మంత, నాగ్‌లు ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌న్మ‌థుడు 2 చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్నారన్న‌మాట‌.

1217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles