రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా సినిమా చేస్తున్న స‌మంత‌

Fri,April 27, 2018 03:57 PM
samantha no remuneration for u turn

చెన్నై చంద్రం స‌మంత.. నాగ చైతన్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది. ఇప్పుడు అభిమానులు ఆమెని తెలుగమ్మాయిగానే భావిస్తున్నారు . పెళ్ళి త‌ర్వాత స‌మంత సినిమాల‌కి పూర్తిగా దూరం అవుతుంద‌ని అంతా అనుకున్నారు. కాని వ‌రుస ఆఫర్స్‌తో దూసుకెళుతుంది రామ‌ల‌క్ష్మీ . స‌మంత న‌టించిన రంగ‌స్థ‌లం ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రాగా, మే 9న మ‌హాన‌టి చిత్రంతో అభిమానుల‌ని అల‌రించ‌నుంది. ఇక త‌మిళంలో విశాల్ స‌ర‌స‌న స‌మంత న‌టించిన చిత్రం ఇరుంబు థిరై. తెలుగులో ఈ చిత్రం అభిమన్యుడు గా రిలీజ్ కానుంది. మే 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శివ కార్తికేయ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న సీమ రాజా చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో స‌మంత సరికొత్త గెట‌ప్‌లో క‌నిపించ‌నుంది.

సూప‌ర్ డీల‌క్స్ అనే సినిమాలోను స‌మంత ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో త‌న భ‌ర్త చైతూ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక క‌న్న‌డ రీమేక్‌లోను స‌మంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో స‌మంత జ‌ర్న‌లిస్ట్‌గా క‌నిపించ‌నుంది. లో బ‌డ్జెట్‌తో రీమేక్ చిత్రం రూపొందుతుండ‌డం వ‌ల‌న స‌మంత యూట‌ర్న్ రీమేక్‌కి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేదట‌. సినిమా లాభాల్లో వాటా ఇచ్చేలా మాట్లాడుకుంద‌ని అంటున్నారు. గ‌తంలోఅనుష్క సైజ్ జీరో చిత్రం కోసం ఇలాంటి ఆలోచనే చేయ‌గా, ఆ మూవీ ఫ్లాప్ కావ‌డంతో ఎక్కువ మొత్తం అందుకోలేక‌పోయింది. కాని స‌మంత మాత్రం రీమేక్ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. యూ ట‌ర్న్ రీమేక్‌లో భూమిక .. ఆది .. రాహుల్ ర‌వీంద్రన్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

4029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles