నాని నిర్మాణంలో లేడీ ఓరియెంటెడ్ చేయ‌నున్న స‌మంత‌!

Sat,January 12, 2019 09:40 AM

నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ పొందిన స‌మంత గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధించింది. ఈ ఏడాది కూడా అదే హ‌వాని కొన‌సాగించాల‌ని అనుకుంటుంది. ప్ర‌స్తుతం తన భ‌ర్త‌తో క‌లిసి మ‌జిలీ అనే సినిమా చేస్తున్న సామ్ త్వ‌ర‌లో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రం చేయ‌నుంద‌ట‌. ఈ చిత్రాన్ని నాని నిర్మించ‌నున్నాడని అంటున్నారు. అ! అనే సినిమాతో నిర్మాత‌గా మంచి హిట్ కొట్టిన నాని సీనియర్ అండ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన లేడీ ఓరియెంటెడ్ కథకి ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. దాంతో ఆ సినిమాని తానే నిర్మించాల‌ని భావించిన‌ట్టు తెలుస్తుంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పిన క‌థ‌లో ప్ర‌ధాన పాత్రధారిగా స‌మంత అయితే బాగుంటుంద‌ని నాని అనుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌నున్న‌ట్టు తెలుస్తుంది. నాని- స‌మంత క‌లిసి ఈగ‌, ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సు చిత్రాల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నాని జెర్సీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ రోజు మ‌ధ్యాహ్నం టీజ‌ర్ రిలీజ్ కానుంది

2302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles