మ‌న్మ‌థుడు2 టీంతో జాయిన్ అయిన స‌మంత‌

Thu,May 2, 2019 08:45 AM

చిల‌సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా మ‌న్మ‌థుడు 2 చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ మ‌న్మ‌థుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం మూవీ చిత్రీక‌ర‌ణ పోర్చుగ‌ల్‌లో జ‌రుగుతుంది. ఇటీవ‌ల మూవీకి సంబంధించి కొన్ని స్టిల్స్ విడుద‌ల కాగా, ఇవి ప్రేక్ష‌కుల‌లో సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఆ మ‌ధ్య సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి.


చిత్రంలో సామ్ పాత్ర కీల‌క పాత్ర కాగా, ఆ రోల్‌కి స‌మంత అయితే బాగుంటుంద‌ని ఆమెని ఎంపిక చేసార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అంద‌రు అనుకుంటున్న‌ట్టే చిత్రంలో స‌మంత కీల‌క పాత్ర పోషిస్తుంద‌ట. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు పోర్చుగ‌ల్‌లో ఉన్న టీంని క‌లిసింది. వారితో ఫోటోలు దిగింది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. చిత్రంలో స‌మంత పాత్ర సుమారు ఐదు నుండి ప‌ది నిమిషాలు ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌నం త‌ర్వాత రాజు గారి గ‌ది 2 చిత్రంలో క‌లిసి న‌టించిన స‌మంత, నాగ్‌లు ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌న్మ‌థుడు 2 చిత్రంలో న‌టిస్తున్నారు.

1661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles