నాగ్ సినిమాలో సమంత..!

Wed,January 11, 2017 12:23 PM
నాగ్ సినిమాలో సమంత..!

కొన్ని కాంబినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా, విచిత్రంగా ఉంటాయి. కొందరు హీరోలు, హీరోయిన్స్ ఎంచుకునే పాత్రలు కూడా వెరైటీగా ఉంటాయి. మన హీరోలు కొందరు రొటీన్ కు భిన్నంగా ఉండే కేరక్టర్స్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలాగే కొందరు హీరోయిన్స్ కూడా వెరైటీ రోల్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. మరీ వండర్ ఏంటంటే ఒక స్టార్ హీరో ఓ సినిమాలో ఇదివరకు ఎన్నడూ చేయని కేరక్టర్ చేస్తుంటే, అదే మూవీలో మరో స్టార్ హీరోయిన్ కూడా కీలక పాత్ర వేస్తోంది.

కాబోయే మామగారి సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ యాక్ట్ చేయనుండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింంది. మరి ఆ మామగారు ఎవరో కాదు నాగార్జున. ఆ హీరోయిన్ సమంత. అయితే వీరిద్దరూ ఆ పిక్చర్ లో హీరో హీరోయిన్స్ గా చేయడం లేదు. ఇద్దరూ రెండు డిఫరెంట్ కేరక్టర్స్ లో కనిపిస్తారు. ఇదివరకు మనం సినిమాలో కూడా సమంత, నాగ్ నటించారు. ఆ పిక్చర్ లో నాగార్జున ను సమంత బిట్టూ అని ముద్దుగా పిలిచింది.

రాజుగారి గది మూవీకి సీక్వెల్ గా తీస్తున్న రాజుగారి గది 2 మూవీలో ఇప్పుడు మళ్లీ నాగార్జున, సమంత నటించ బోతున్నారు. ఈ హారర్ర థ్రిల్లర్ మూవీలో నాగార్జున మాంత్రికుడి పాత్రలో కనిపిస్తాడు. ఈ మాంత్రికుడు పాతకాలపు మాంత్రికుడు కాదు. మోడర్న్ మాంత్రికుడు. నాగార్జున ఇలాంటి కేరక్టర్ వేయడం ఇదే ఫస్ట్ టైం. ఓంకార్ డైరెక్షన్ లో రాబోయే ఈ పిక్చర్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది.

ఆమధ్య వచ్చిన రాజుగారి గది మూవీ అనుకోని సక్సెస్ ను సాధించింది. ఆ ఇన్స్ పిరేషన్ తో తీసే ఈ సీక్వెల్ లో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. ఒక హీరోయిన్ గా ఇప్పటికే సీరత్ కపూర్ ను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మరో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేశారు. ఈ సినిమాలో సమంత కేరక్టర్ చాలా వెరైటీగా ఉంటుందట.

2147
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS