చర్చికి లాక్కెళ్ళిన రోజులు గుర్తుకొచ్చాయి: సమంత

Fri,January 12, 2018 03:41 PM
samantha in front of church

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీస్ లో సమంత ఒకరు. ఇటీవల చైతూని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిన సమంత ప్రస్తుతం తన సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. తెలుగులో రంగస్థలం, మహానటి చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు తమిళంలో ఇరుంబుతిరై ( తెలుగులో అభిమన్యుడు), సూపర్ డీలక్స్, యూ టర్న్ వంటి చిత్రాలలో నటిస్తుంది. తాజాగా సామ్ తన సోషల్ మీడియా పేజ్ లో చర్చి ముందు దిగిన ఫోటోని షేర్ చేస్తూ..పాత రోజులని గుర్తు చేసుకుంది. అప్పట్లో మా అమ్మ బలవంతంగా చర్చికి తీసుకెళ్ళిన రోజులు గుర్తుకొచ్చాయి. వారంలో బుధవారం, శనివారం, ఆదివారం ఈ మూడురోజులు అమ్మ చర్చికి తీసుకెళ్ళేది. అప్పుడు నాకు అస్సలు నచ్చేది కాదు.. అని ఆమె ప్రార్ధనలే నన్ను రక్షించాయి అని కాస్త ఉద్వేగంగానే పోస్ట్ పెట్టింది సమంత. ఒక వైపు నటిగా వరుస ఆఫర్స్ అందుకుంటున్న సమంత త్వరలో ప్రొడక్షన్ స్టార్ట్ చేయనుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.

2363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS