స‌మంత మంచి ప‌నికి హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్స్

Fri,June 22, 2018 10:35 AM
samantha helps to the children

న‌టిగానే కాదు, సేవా దృక్ప‌థంతో అంద‌రి మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల భామ సమంత‌. పెళ్ళికి ముందు నుండే ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ ప్ర‌త్యూష ఫౌండేష‌న్ అనే స్వ‌చ్చంద సేవా సంస్థని స్థాపించింది. దీని ద్వారా ఎంతో మంది అనాధ‌ల‌కి అండ‌గా ఉంటుంది స‌మంత. గ‌తంలో కొందరు సెలబ్రెటీలకు సంబంధించిన వస్తువులు.. దుస్తుల్ని వేలం వేసిన స‌మంత‌ ఆ మొత్తాన్ని ఫౌండేషన్ కు అందజేసింది. ఇక త‌న పెళ్లికి వచ్చిన గిఫ్ట్స్‌లో కొన్నింటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని కూడా ఫౌండేష‌న్‌కి అందజేసింద‌నే టాక్ న‌డిచింది. అయితే అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న త‌ర్వాత స‌మంత‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింది. కుటుంబంలో స‌భ్యురాలిగా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తూనే మ‌రోవైపు తోటి వారికి సేయం చేస్తుంది సామ్‌.

స‌మంత తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఏడాది మొత్తం వంద మంది చిన్నారులకి త‌మ కుటుంబం ఒక పూట భోజ‌నం అందిస్తుంది . మీరు కూడా మీ వంతు సాయంగా కేవ‌లం 950 రూపాయ‌ల‌తో విద్యార్ధికి ఏడాది మొత్తం రుచిక‌ర‌మైన భోజ‌నం అందించొచ్చని తెలిపింది. అక్ష‌య పాత్ర ద్వారా చిన్నారులకి స‌మంత చేస్తున్న ఈ సాయాన్ని నెటిజ‌న్స్ అభినందిస్తున్నారు. మ‌రికొంద‌రు ఈ సేవా కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఉత్సుక‌త చూపుతున్నారు. ద‌క్షిణాది టాప్ హీరోయిన్‌గా ఉన్న స‌మంత‌కి వ‌రుస హిట్స్ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం యూ టర్స్‌, సీమ‌రాజా, సూప‌ర్ డీలక్స్‌, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రాల‌తో బిజీగా ఉంది.


3390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS