వినికిడి లోపం ఉన్న పిల్ల‌ల‌కి స‌మంత చేయూత‌

Sat,July 14, 2018 10:38 AM
samantha helps to poor people

న‌టిగానే కాదు, సేవా దృక్ప‌థంతో అంద‌రి మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల భామ సమంత‌. పెళ్ళికి ముందు నుండే ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ ప్ర‌త్యూష ఫౌండేష‌న్ అనే స్వ‌చ్చంద సేవా సంస్థని స్థాపించింది. దీని ద్వారా ఎంతో మంది అనాధ‌ల‌కి అండ‌గా ఉంటుంది స‌మంత. గ‌తంలో కొందరు సెలబ్రెటీలకు సంబంధించిన వస్తువులు.. దుస్తుల్ని వేలం వేసిన స‌మంత‌ ఆ మొత్తాన్ని ఫౌండేషన్ కు అందజేసింది. ఇక త‌న పెళ్లికి వచ్చిన గిఫ్ట్స్‌లో కొన్నింటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని కూడా ఫౌండేష‌న్‌కి అందజేసింద‌నే టాక్ కూడా ఉంది. అయితే అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న త‌ర్వాత స‌మంత‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింది. కుటుంబంలో స‌భ్యురాలిగా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తూనే మ‌రోవైపు తోటి వారికి సేయం చేస్తుంది సామ్‌.

స‌మంత ఇటీవ‌ల త‌మ కుటుంబం వంద మంది చిన్నారులకి ఒక పూట భోజ‌నం అందిస్తున్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ద్వారా చెప్పిన సంగ‌తి తెలిసిందే . త‌న అభిమాన‌లు కూడా కేవ‌లం 950 రూపాయ‌ల‌తో విద్యార్ధికి ఏడాది మొత్తం రుచిక‌ర‌మైన భోజ‌నం అందించొచ్చని తెలిపింది. అక్ష‌య పాత్ర ద్వారా చిన్నారులకి స‌మంత చేస్తున్న ఈ సాయాన్ని నెటిజ‌న్స్ అభినందించారు. ఇక తాజాగా ఫోనాక్ అనే సంస్థ ద్వారా వినికిడి లోపంతో బాధ‌ప‌డుతున్న ప‌ది మంది చిన్నారుల‌కి వినికిడి యంత్రాలు అందించారు. ఈ సంస్థ వినికిడి లోపంతో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌ని గుర్తించి ఉచిత శిబిరాలు నిర్వ‌హిస్తోంది. భవిష్య‌త్‌లో సంస్థ‌కి కావ‌ల‌సిన సాయం తాను అందిస్తానంటూ స‌మంత పేర్కొంది. సినిమాల విష‌యానికి వ‌స్తే ద‌క్షిణాది టాప్ హీరోయిన్‌గా ఉన్న స‌మంత‌కి ఈ ఏడాది వ‌రుస హిట్స్ ప‌లుక‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం యూ టర్స్‌, సీమ‌రాజా, సూప‌ర్ డీలక్స్‌, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రాల‌తో బిజీగా ఉంది.1068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS