'యూ టర్న్‌'లో సమంత ఫస్ట్‌లుక్

Sun,July 22, 2018 04:26 PM

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సమంత ఖాతాలో మరో హిట్ చేరిన విషయం విదితమే. ఆ సినిమా తరువాత ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'యూటర్న్'. ఇటీవలే ఈ సినిమాకు గాను షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను సమంత పూర్తి చేసుకుంది. పవన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో సమంత ఫస్ట్ లుక్‌ను ఇవాళ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles